Dimple Hayathi : ప్రముఖ నటి డింపుల్ హయతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017 వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో సూపర్ హిట్ అనే పాట గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పరాజయం పాలవడంతో కొంచెం ఢీలా పడిపోయింది. ప్రస్తుతం గోపీచంద్ సరసన రామబాణం సినిమాలో నటించింది. రిలీజ్ కి రెఢీ గా ఉన్న ఈ మూవీ పైనే అమ్మడు భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమనులతో టచ్ లో ఉంటూ తన లేటెస్ట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Dimple Hayathi : గోపీచంద్ “రామబాణం” పైనే ఆశలు పెట్టుకున్న “డింపుల్ హయతి”..

dimple hayathi latest photos goes viral on social media