Deviyani Sharma: ఢిల్లీ కి చెందిన దేవయాని శర్మ.. మొదట మోడలింగ్ వైపు వెళ్లి పలు షోలతో ఇంప్రెస్ చేసింది. యాక్టింగ్ పై ఇంట్రస్ట్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కానీ అవకాశాలు పెద్దగా రాకపోవడంతో.. ఉత్తరాది నుంచి సౌత్ ఇండస్ట్రీకి వచ్చింది. 2020లో భానుమతి రామకృష్ణ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది దేవియాని. పూరీ ఆకాశ్ నటించిన రొమాంటిక్ లోనూ కనిపించింది. మహి రాఘవ దర్వకత్వంలో రీసెంట్ గా విడుదలైన ‘సేవ్ ద టైగర్స్ ’వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది దేవయాని శర్మ. త్వరలో ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులను బయపెట్టేందుకు వస్తోంది. ఈ సిరీస్ కు కూడా మహి రాఘవనే డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 15 డిస్నీ + హాట్ స్టార్ లో ఈ సిరీస్ రాబోతుంది.