Ashu Reddy : అషురెడ్డి.. ఈ బిగ్ బాస్ బ్యూటీ తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు సుపరిచితురాలే. డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఆషురెడ్డి సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత టీవీ షోలో పాల్గొంటూ సందడి చేస్తోంది. పవన్ కళ్యాణ్ వీరాభిమానురాలిగా.. మంచి పర్ తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఈ అమ్మడు చేసిన ఇంటర్వ్యూల గురించి చెప్పక్కర్లేదు. ఇక సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో గ్లామర్ షో తో రెచ్చిపోతూ.. రోజురోజుకీ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.