Aparna Das : తమిళంలో మనోహరం, బీస్ట్ వంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అపర్ణా దాస్. ఇటీవల దాదా అనే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందర్నీ మెరిపించింది. ఇక ఇప్పుడు తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది ఈ భామ. పంజా వైష్ణవ్ తేజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే శ్రీలీల నటిస్తుండగా.. తాజాగా అపర్ణదాస్ ని ఎంపిక చేశారు. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానుల్ని ఫిదా చేస్తుంది.