Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్.. మలయాళం “ప్రేమమ్” సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది అనుపమ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా.. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇటీవలే కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలలో కనిపించి అలరించింది ఈ భామ. ఇక సోషల్ మీడియా లోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఈ చిన్నది.