Anchor Manjusha : యాంకర్ మంజూష.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరలోకి రాకముందే వెండితెరపై పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రంలో హీరో కి చెల్లెలిగా ప్రధాన పాత్రలో మంజూష నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్రమక్రమంగా వెండితెరపై కనుమరుగై.. బుల్లితెర పైన మంజూష సందడి చేస్తుంది. ఆడియో ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అలానే మంజూష ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులకు ఎప్పుడు మంచి కిక్ ఇస్తూ ఉంటుంది.