Sakshi Vaidya : అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ ద్వారా సాక్షి వైద్య టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్ తో అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. ముంభై బ్యూటీ సాక్షి వైద్య మహారాష్ట్ర లోని ఠాణెలో 2000 జూన్ 19న సాక్షి జన్మించింది. గ్రాడ్యూయేషన్ పూర్తి కాగానే.. ఫ్యాషర్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. పలు యాడ్స్ చేసిన ఆమెకు ఏజెంట్ సినిమా ఛాన్స్ వచ్చింది. డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ క్రమం లోనే చిత్రప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..