Actress Poorna: షామ్నా కాసిమ్ కంటే కూడా తెలుగు ప్రేక్షకులకు “పూర్ణ”గానే ఎక్కువ పరిచయం ఈ బ్యూటీ. ‘శ్రీమహాలక్ష్మీ’ ‘సీమ టపాకాయ్’ ‘అవును’ వంటి చిత్రాలతో పాపులర్ అయిన ఈ హీరోయిన్ ఆ తర్వాత బుల్లితెరలో ఢీకి జడ్జిగా వ్యవహరించింది. కాగా ఈ అమ్మడు 2022 జూన్ నెలలో దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మెన్ షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంక 4 ఏప్రిల్ 2023న పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పూర్ణ ఇటీవల తన కొడుకు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.