Aishwarya Lekshmi: మట్టికుస్తీ కుస్తీ భామ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. విశాల్ హీరోగా నటించిన “యాక్షన్” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య లక్ష్మి పలు డబ్బింగ్ సినిమాతో పాటు తెలుగు మూవీస్ లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక పొన్నియనస్ సెల్వన్ లాంటి పెద్ద చిత్రాల్లోనూ నటించి తన క్రేజ్ మరోసారి చాటిచెప్పింది ఈ మళయాల ముద్దుగుమ్మ. ఇకపోతే 2022 ఒక్క ఏడాదిలోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది ఈ అందాల తార.