Site icon Prime9

wrestlers: మా పతకాలను గంగానదిలో నిమజ్జనం చేస్తాం.. రెజ్లర్లు

wrestlers

wrestlers

wrestlers: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లను అక్కడనుంచి పంపించిన నేపధ్యంలో వారు మంగళవారం తమ మెడల్స్ ను హరిద్వార్ లోని గంగానదిలో నిమజ్జనం చేస్తామని తెలిపారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ ప్రకటనలో పతకాలను నిమజ్జనం చేసిన తరువాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహారదీక్షకు కూర్చుటుంటామని తెలిపారు.

ఇండియా గేట్ వద్ద నిరాహారదీక్ష..(wrestlers)

ఈ పతకాలు మన జీవితాలు, మన ఆత్మలు. ఈరోజు వారిని గంగలో నిమజ్జనం చేసిన తర్వాత జీవించడానికి కారణం ఉండదు. ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేస్తాం అని సాక్షి మాలిక్, బజరంగ్ పునియా మరియు సంగీతా ఫోగట్‌తో సహా రెజ్లర్లు ఈ ప్రకటన చేసారు..ఏప్రిల్ 23 నుండి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మైనర్‌తో సహా మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపుల ఆరోపణలపై నిరసనలు చేస్తున్నారు.

మే 28న వందలాది మంది పోలీసులు మరియు పారామిలటరీ సిబ్బంది పార్లమెంట్ హౌస్ వైపు వారి ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నిరసనకారులు భద్రతా వలయాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించడంతో, తీవ్ర వాగ్వాదం జరిగింది. రెజ్లర్లు మరియు పోలీసులు ఒకరినొకరు తోసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని తరువాత విడిచిపెట్టారు. రెజ్లర్లను పోలీసులు అడ్డుకోవడాన్ని పలు రాజకీయపార్టీలు, నేతలు ఖండించారు.

Exit mobile version