Trains canceled: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో జూలై 7 మరియు జూలై 15 మధ్య 300 కంటే ఎక్కువ మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరియు 406 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
వాయువ్య భారతదేశంలో శనివారం నుండి మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. దీనితో జమ్మూ మరియు కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్‌లలో చాలా ప్రాంతాలలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. జమ్మూ మరియు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పంజాబ్‌లలో నదులు, వాగులు మరియు కాలువలు పొంగిపొర్లడంతో మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి . అవసరమైన సేవలకు అంతరాయం ఏర్పడింది.ఈ ప్రాంతంలో నడుస్తున్న దాదాపు 300 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఉత్తర రైల్వే రద్దు చేసింది. మరో 191 రైళ్లను దారి మళ్లించింది. 406 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. మరో 28 రైళ్లను దారి మళ్లించింది.