Site icon Prime9

Jagdeep Dhankhar: పార్లమెంటే సుప్రీం.. మరోసారి ధన్‌ఖర్ చురకలు

No Authority Above Parliament Jagdeep Dhankhar Rips Into Supreme Court

 

 

భారత ఉప రాష్ట్ర పతి జగదీప్ ధన్‌ఖర్ సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించారు. మంగళవారం ఢిల్లీ యునివర్సిటీలో మాట్లాడిన ఆయన పార్లమెంట్ కంటే ఏ వ్యవస్థకూడా సుప్రీం కాదని స్పష్టం చేశారు. “పార్లమెంట్ అనేది అత్యుత్తమమైనది. ప్రజలు ఎన్నుకోబడిన ప్రతినిధులు అంతిమ యజమానులు. నేను మాట్లాడే ప్రతీమాట జాతీయ ప్రయోజనాలను ఉద్దేశింపడింది. ప్రజా ప్రతినిధులను ఏ వ్యవస్థా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకూడదు. అందుకు రాజ్యంగంకూడా ఒప్పుకోదు. ” అని ఆయన తెలిపారు.

 

ప్రజాప్రతినిధులే ఫైనల్
రాజ్యాంగ పరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే ( ఎంపీలు ) అల్టిమేట్ మాస్టర్స్ అని అన్నారు ధన్‌ఖర్. ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యమని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. అందులో భాగంగానే ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారు. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి నిర్ణిత గడువులో సమ్మతి తెలపాలని ఇటీవల సుప్రీ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

 

ప్రజాస్వామ్యానికి అంతరాయం కలిగించొద్దు
రాష్ట్రపతిపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకుగాను ధన్‌ఖర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతికే గడువునిర్ణయించేలా కోర్టులు వ్యవహరించరాదన్నారు. సుప్రీంకోర్టు పార్లమెంటులా వ్యవహరించకూడదని హితవుపలికారు. కొందరి నిశబ్దం ప్రమాదకరంగా ఉండకూడదనే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. సంస్థలను కూల్చివేసేందుకు, వ్యక్తులను కించపరిచేందుకు ఎవరికీ అనుమతులులేవన్నారు. మనం మన భారతీయత పట్ల గర్వపడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని అంతరాయం కలిగించే ఏచర్యకూ భారతీయులు సిద్దంగా లేరని చెప్పారు.

 

Exit mobile version
Skip to toolbar