Site icon Prime9

Nitish Kumar’s Comments: నితీష్ కుమార్ వ్యాఖ్యలపై బీహార్ అసెంబ్లీలో దుమారం.

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar’s Comments: జనాభా నియంత్రణలో మహిళల విద్య కీలకపాత్ర వహిస్తుందంటూ బీహార్ సీఎం, జెడి(యు) నేత నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించడంతో బుధవారం బీహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. తర్వాత ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నితీష్ కుమార్ ఏమన్నారంటే..(Nitish Kumar’s Comments)

బీహార్‌ అసెంబ్లీలో మంగళవారం నాడు నితీష్‌కుమార్‌ కులగణన నివేదిక గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన చదవుకున్న మహిళలు సెక్స్‌లో పాల్గొన్నా గర్బం రాకుండా జాగ్రత్త పడతారు. దీంతో జనాభాను నియంత్రించవచ్చు అని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని మరోమారు ఆయన లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో కూడా దీని గురించి ఒక ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా నితీష్‌ బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో పురుషుడు, స్త్రీ మెట్రిక్‌ పాస్‌ అయిన వారు లేదా గ్రాడ్యుయేట్‌ లేదా క్లాస్‌ 10 పాస్‌ అయితే అయితే ఫెర్టిలిటీ రేటు రెండుగా ఉంది. అదే బిహార్‌లో కూడా పురుషుడు, స్రీ ఇద్దరు మెట్రిక్‌ పాస్ అయితే ఫెర్టిలిటి రేటు రెండుగా ఉంది. అదే స్త్రీ గ్రాడ్యుయేట్‌ లేదా ఇంటర్‌ లేదా 12వ తరగతి అయితే జాతీయ స్థాయిలో ఫెర్టిలిటి రేటు 1.7 గా ఉంటే బిహార్‌లో 1.6గా ఉందని ఆయన వివరించారు.నేను నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. నా వ్యాఖ్యలు తప్పుగా అర్దం చేసుకున్నారు నేను కేవలం మహిళా విద్య గురించి మాట్లాడాను. నా ప్రకటనలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను అని నితీష్ కుమార్ అన్నారు.

సిగ్గులేదు..

మరోవైపు ప్రధాని మోదీ కూడ నితీష్ కుమార్ వ్యాఖ్యలను ఖండించారు. మధ్యప్రదేశ్ లోని ’గుణ ‘లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమికి చెందిన ఒక పెద్ద నాయకుడు నిన్న బీహార్ అసెంబ్లీ లోపల మహిళలపై అసభ్య పదజాలం ఉపయోగించాడు. వారికి సిగ్గు లేదు. కూటమికి చెందిన ఏ నాయకుడూ దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏదైనా మేలు చేయగలరా? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. తల్లులు, సోదరీమణుల పట్ల ఈ దుర్మార్గపు వైఖరి ఉన్నవారు మన దేశాన్ని అవమానిస్తున్నారు. వీరు ఎంతకైనా దిగజారిపోతారని ఆయన అన్నారు.

సి-గ్రేడ్ సినిమాల్లో డైలాగులు..

నితీష్ కుమార్ లాంటి వ్యక్తి మా రాష్ట్రానికి సీఎం అయినందుకు తాను సిగ్గు పడుతున్నానంటూ కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్‌కె సింగ్ అన్నారు. అతను స్త్రీ ద్వేషి.. అసభ్యకరమైన, పితృస్వామ్యంతో కూడిన వ్యాఖ్యలు చేసారు. ఇది థర్డ్ గ్రేడ్ స్టేట్‌మెంట్.. నితీష్‌ కుమార్‌కి మతి పోయింది అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు జాతీయ మహిళా కమీషన్ కూడా నితీష్ కుమార్ వ్యాఖ్యలపట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. Nవిధానసభలో కుమార్ ఇటీవల చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు తిరోగమనం మాత్రమే కాకుండా మహిళల హక్కుల పట్ల చాలా అసహ్యకరమైనవి. ఈ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలకు బీహార్ ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు క్షమాపణలు చెప్పాలంటూ కమీషన్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో రాసింది.  కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ నితీష్ కుమార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన సి-గ్రేడ్ సినిమాల్లో డైలాగుల మాదిరిగా ఉన్నాయని ఆమె విమర్శించారు.

Exit mobile version