Site icon Prime9

Udhayanidhi Stalin : మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్…

Stalin

Stalin

Udhayanidhi Stalin : డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఉదయనిధికి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించారు.

సామాజిక న్యాయ కార్యక్రమాలను అమలు చేసే మరియు తమిళుల సంక్షేమాన్ని పరిరక్షించే ద్రావిడ మోడల్ ప్రభుత్వ క్యాబినెట్‌లో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి @mkstalin గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. నేనెప్పుడూ బాధ్యతతో పని చేస్తాను’ అని ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చేశారు.

45 ఏళ్ల ఉదయనిధి స్టాలిన్ డీఎంకే యువజన విభాగం చీఫ్ గా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచే అతడిని మంత్రి చేయాలని డీఎంకే లో సీనియర్ నేతలు సీఎం స్టాలిన్ ను కోరడం ప్రారంభించారు. నిర్మాత, నటుడు, డిస్ట్రిబ్యూటర్ అయిన ఉదయనిధి స్టాలిన్ ఇకపై తాను పూర్తిగా రాజకీయాలకే సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు. రాబోయే తమిళ చిత్రం మామన్నన్ నటుడిగా తన చివరి చిత్రం అని ప్రకటించాడు.

Exit mobile version