Two Maoists killed in Bijapur -Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు అగ్ర కామాండర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే వీరి వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, గతకొంతకాలంగా నేషనల్ పార్క్‌లో భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లుతోంది. అంతకుముందు మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ హతమయ్యారు. కాగా, సుధాకర్‌పై రూ.కోటి రివార్డు ఉండగా.. భాస్కర్‌పై రూ.25 లక్షల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.