Prime9

Tejashwi Yadav: తేజస్వి యాదవ్ కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ ను ఢీకొట్టిన ట్రక్కు

Truck hits Tejashwi Convoy: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. తేజస్వీ యాదవ్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. కాగా తేజస్వీ యాదవ్ రాత్రి 1.30 గంటల సమయంలో మాధేపుర నుంచి పాట్నాకు వెళ్తుండగా ఘటన జరిగింది. హైవేపై టీ తాగేందుకు వీరంతా ఓ చోట ఆగారు. తేజస్వీ యాదవ్, తన అధికార ప్రతినిధి శక్తి యాదవ్, కొందరు పార్టీ నేతలతో కలిసి టీ తాగుతున్నారు. అదే సమయంలో దూసుకొచ్చిన ట్రక్కు కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే హాజీపూర్ సమీపంలోని సదర్ ఆసుపత్రికి తరలించారు.

 

ప్రమాదంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. “మేము ఓ కార్యక్రమాన్ని ముగించుకుని మాధేపుర నుంచి తిరిగి వస్తున్నాం. మధ్యలో టీ తాగడానికి ఆగాం. ఓ ట్రక్కు అదుపుతప్పి నా ముందు ఉన్న 2,3 వాహనాలను ఢీకొట్టింది. మా భద్రతా సిబ్బంది నిలబడి ఉన్నారు. వాహనం వారిని ఢీకొట్టింది. ముగ్గురు గాయపడ్డారు. కొంచెం అజాగ్రత్తగా ఉంటే నాకు ప్రమాదం జరిగి ఉండేది. ప్రమాదంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి”. అని అన్నారు.

Exit mobile version
Skip to toolbar