Site icon Prime9

రామసేతు: రామసేతుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు.. ఆధారాలే లేవంటూ..!..

Ram Setu

Ram Setu

Ram Setu: రామసేతుపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. హర్యానాకు చెందిన స్వతంత్ర ఎంపీ కార్తికేయ శర్మ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. రామసేతునిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన కోసం ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఇలా చెప్పింది, రామసేతు యొక్క అసలు రూపం అక్కడ ఉందని చెప్పడం కష్టం. అయితే, కొన్ని సూచనలు ఉన్నాయి. నిర్మాణం అక్కడ ఉండవచ్చని తెలిపింది. గత ప్రభుత్వాలు నిరంతరంగా ఈ సమస్యపై శ్రద్ధ చూపకపోవడంతో భారతదేశం యొక్క అద్భుతమైన చరిత్రపై ప్రభుత్వం ఏదైనా శాస్త్రీయ పరిశోధన చేస్తుందా అని కార్తికేయ శర్మ ప్రశ్నించారు.

ఆయన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బదులిస్తూ.. ‘రామసేతుకు సంబంధించి మా ఎంపీ ప్రశ్న లేవనెత్తినందుకు సంతోషిస్తున్నాను. ఇది దాదాపు 18 వేల ఏళ్ల క్రితం నాటి చరిత్ర. మనం చెబుతున్న వంతెన.. దాదాపు 56 కి.మీ పొడవైనదని తెలుస్తుందిస్పేస్ టెక్నాలజీ ద్వారా, సముద్రంలో కొన్ని రాళ్ల ముక్కలు కనుగొనబడినట్లు మేము కనుగొన్నాము. కొనసాగింపును చూపించే కొన్ని ఆకారాలు ఉన్నాయి. సముద్రంలో కొన్ని ద్వీపాలు మరియు సున్నపురాయి వంటివి కనిపించాయి. సింపుల్ గా చెప్పాలంటే రామసేతు అసలు రూపం అక్కడ ఉందని చెప్పడం కష్టం. అయితే, అక్కడ నిర్మాణం ఉండవచ్చని సూచించే కొన్ని సూచనలు ఉన్నాయి.పురాతన నగరం ద్వారక మరియు అటువంటి కేసులను పరిశోధించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

దీనిపై కాంగ్రెస్‌ అధినేత పవన్‌ ఖేరా బీజేపీపై విమర్శలు గుప్పించారు. భక్తులందరూ చెవులు విప్పి వినండి, కళ్లతో చూడండి.. రామసేతు ఉందనడానికి ఎలాంటి రుజువు లేదని పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. తమ ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది. కానీ, ఆ సమయంలో కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకులు అంటూ బీజేపీ విమర్శించింది’’ అని అన్నారు. పవన్ ఖేరా తో పాటు విపక్ష నేతలంతా ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీ అసలు రూపం బయటపడిందన్నారు.

రామసేతు అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వరం (పంబన్) ద్వీపానికి, శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్బల శ్రేణి.ఈ దిబ్బ ముఖ్యంగా ఇసుక, సున్నపు రాళ్ళను కలిగియుంటుంది.ప్రాచీన భారతీయ సంస్కృత ఇతిహాసం రామాయణంలో, రామసేతును రాముడు మరియు అతని సైన్యం నిర్మించినట్లు ప్రస్తావించబడింది. అందువల్ల, ఇది గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Exit mobile version