Karnataka : తండ్రి సంపాదించిన ఆస్తులను అతని సంతానం కొడుకులు, కుమార్తెలు సమానంగా అనుభవించవచ్చు. అదేవిధంగా తండ్రి అప్పులు చేస్తే పిల్లలందరూ సమానంగా చెల్లించవలసివుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణంగా కొడుకులు తమ తండ్రులు వారసత్వంగా ఇచ్చిన ఆస్తులు ఏమిటనేదానిపైనే ఆలోచిస్తారు. వారు అప్పులు చేసారంటే భయపడతారు. వాటికి తమకు సంబంధం లేదని కూడ కొందరు అంటుంటారు. అయితే అలాంటి కొడుకులకు షాకిచ్చేలా కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 29 ప్రకారం తండ్రి చనిపోతే, అప్పులు తీర్చాల్సిన బాధ్యత కొడుకుపై ఉంటుందని స్పష్టం చేసింది.
ఆస్తితో పాటు అప్పులు సమానమే
కర్ణాటక (Karnataka) లో భారమప్ప అనే వ్యక్తి వ్యాపారం, కుటుంబ అవసరాల నిమిత్తం 2003లో ప్రసాద్ రాయకర్ అనే వ్యక్తి నుంచి రూ. 2.60 లక్షలు రూ. 2 వడ్డీతో తీసుకున్నారు. ఆ అప్పును తీర్చకుండానే భారమప్ప మరణించాడు. దీంతో తన అప్పును తీర్చాలని భారమప్ప కొడుకు దినేశ్ ను ప్రసాద్ కోరగా తనకు సంబంధం లేదని దినేశ్ జవాబిచ్చాడు. దీనితో ప్రసాద్ మేజిస్ట్రేటు కోర్టులో ఫిర్యాదు చేశాడు. అప్పు చెల్లించాల్సిందేనని ఆ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై దినేశ్ జిల్లా కోర్టుకు వెళ్లగా రుణం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. మళ్లీ ప్రసాద్ హైకోర్టులో అప్పీలు చేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఐసీడీఎస్ లిమిటెడ్ వర్సెస్ బీనా షబీర్
భారమప్ప 2005లో రూ. 10 వేలు చెల్లించాడు. ఆ తర్వాత పలు దఫాలుగా చెక్కులు ఇచ్చినప్పటికీ ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తండ్రి చేసిన అప్పును కొడుకు తీర్చాల్సిందేనని తీర్పును వెలువరించింది.చెక్కులు కూడా ఇచ్చిన అనంతరం రుణంతో తనకు సంబంధం లేదని చెప్పడం తగదని ధర్మాసనం పేర్కొంది. ఐసీడీఎస్ లిమిటెడ్ వర్సెస్ బీనా షబీర్ అండ్ అన్ఆర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. తండ్రి చేసిన అప్పును కొడుకు తీర్చాల్సిందేనని తీర్పును వెలువరించింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/