Prime9

PM Modi : మాజీ సీఎం విజయ్‌ రూపానీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రధాని మోదీ

PM Narendra Modi : అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన బీజేపీ నేత, గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. విజయ్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 241 మంది మృతిచెందారు. ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు.

 

గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత విజయ్‌ రూపానీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లండన్‌లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండుసార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు పూజిత్‌ ఓ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Exit mobile version
Skip to toolbar