Site icon Prime9

Karnataka Government : పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

Karnataka Government

Karnataka Government : కర్ణాటక సర్కారు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు వారానికి రెండు క్లాసులు లైంగిక విద్యను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. దీని గురించి సమాచారం ఇస్తూ, పిల్లల్లో విలువలను పెంపొందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మధు బంగారప్ప చెప్పారు. టీనేజర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధ్యమైన పరిష్కారాలను ఇటీవల శాసన మండలిలో చర్చించగా, అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలను అందించాలన్నారు.

 

 

ఈ క్రమంలోనే రాబోయే విద్యా సంవత్సరంలో నైతిక విలువల బోధనతో పాటు 8 నుంచి 12 తరగతుల విద్యార్థులకు వారంలో రెండు రోజులు సెక్స్ ఎడ్యుకేషన్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. లైంగిక విద్య అనేది తప్పుడు అంశం ఎంత మాత్రం కాదన్నారు. మానవ విలువలు క్షీణిస్తున్న వేళ ఇతిహాసాల కథలు, మహనీయులు జీవిత చరిత్రల ద్వారా పిల్లలకు నైతిక పాఠాలు బోధించడం చాలా అవసరమని మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar