Prime9

G7 Summit : జీ-7 సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కెనడా ప్రధాని ఫోన్‌

India invited to G7 summit : కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల 15వ తేదీ నుంచి 17 వరకు జీ7 సదస్సు జరగనున్నది. ఈ మేరకు భారత్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కెనడా ప్రధాని మార్క్‌ కార్నే ఫోన్‌ చేసి సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. విషయాన్ని మోదీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. కార్నేతో ఫోన్‌లో మాట్లాడటం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కెనడా ప్రధానిని అభినందించినట్లు తెలిపారు.

 

భారత్‌, కెనడా శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలు : మోదీ
భారత్‌, కెనడా శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలని మోదీ అన్నారు. పరస్పరంగా గౌరవించుకుంటూ పనిచేస్తామని పేర్కొన్నారు. మార్క్‌ కార్నేతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. 51వ జీ-7 సదస్సుకు కెనడా ఆతిథ్యమిస్తున్నది. జీ7 దేశాల్లో భారత్‌ లేకున్నప్పటికీ నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు ప్రధాని శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొంటున్నారు. గతేడాది ఇటలీ వేదికగా సదస్సు జరిగింది. సదస్సులో భారత్‌పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గొన్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాల్గొని తన గళాన్ని వినిపించారు.

Exit mobile version
Skip to toolbar