Site icon Prime9

Election Commission : ఆధార్, ఓటర్‌ ఐడీ కార్డు అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

Election Commission

Election Commission : ఈసీ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్‌తో ఓటర్‌ కార్డు అనుసంధానం ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. మంగళవారం పలుశాఖల ముఖ్య కార్యదర్శులతో ఎన్నికల కమిషన్ సమావేశమైంది. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను అత్యంత వేగంగా జరపాలని నిర్ణయించింది. దీంతో దొంగ ఓట్లను పూర్తిగా నివారించొచ్చని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఆధార్ కార్డుతోపాటు ఓటరు ఐడీ అనుసంధానం అయితేనే ఓటింగ్‌కు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు రిగ్గింగ్ వంటివి జరిగే ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉండనుందని పేర్కొంది. దీంతో ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా, ఓటరు ఐడీ కార్డుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. నకిలీ ఓటరు జాబితా ద్వారా మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారు అయ్యాయని పలు పార్టీలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఓట‌రు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని భావించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar