Site icon Prime9

Rahul Gandhi : సావర్కర్ కేసులో విచారణకు గైర్హాజరు.. రాహుల్‌ గాంధీకి రూ.200 జరిమానా

Rahul Gandhi

Rahul Gandhi : లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు రూ.200 ఫైన్ విధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రాహుల్ గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్‌ గాంధీకి జరిమానా విధిస్తూ ఏప్రిల్ 14న తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఈ కేసులో విచారణకు రాహుల్ బుధవారం హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఈ క్రమంలోనే విచారణకు హాజరు కాలేదని కోర్టుకు వివరించారు. కోర్టు లాయర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. హాజరు కానుందుకు కోర్టు రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14వ తేదీన కచ్చితంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

కేసు నేపథ్యం..
మహారాష్ట్రలోని అకోలాలో కొన్ని రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లకు సావర్కర్ లేఖ రాశారని, తన చర్యలకు క్షమాపణ చెప్పారని కోరారు. దీంతో మహాత్మాగాంధీ ఇతర స్వాతంత్ర్య యోధుల పోరాటాన్ని నీరు గార్చారని ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. సావర్కర్‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని న్యాయవాది నృపేంద్ర పాండే కేసు వేశారు. వీరసావర్కర్‌ను ఆంగ్లేయుల సర్వెంట్‌, పెన్షనర్‌గా రాహుల్ గాంధీ పేర్కొన్నారని, తన వ్యాఖ్యల ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్నితక్కువ చేసి మాట్లాడారని, సమాజంలో విభజలను ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ క్రమంలో సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారితో విచారణ జరిపించాలని హజ్రత్ గంజ్ పీస్‌కు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరు కాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది.

Exit mobile version
Skip to toolbar