Site icon Prime9

Lok Sabha : కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు.. కేంద్రం మరోసారి క్లారిటీ

Lok Sabha

Lok Sabha

Lok Sabha : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంపీలకు గతంలో ఇచ్చిన కోటాను పునరుద్ధరించే అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ రాంప్రీత్‌ మండల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమాధానం ఇచ్చారు.

2022 ఏప్రిల్‌లో రద్దు..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగం చేస్తూ బదిలీ అయిన పిల్లలు మాత్రమే కేవీల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. కేంద్రీయ విద్యాలయాల ద్వారా దేశవ్యాప్తంగా ఒకే రకమైన చదువు అందుతుంది. కేవీ సంఘటన్‌ ప్రవేశాల్లో ఉండే ఎంపీ కోటా సహా పలు ప్రత్యేక ప్రొవిజన్లను గతంలో ఉపసంహరించుకుంది. ప్రత్యేక కోటా తరగతి గది సంఖ్యకు మించి ఉండేది. దీంతో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి అధికంగా ఉండేది. అందుకనుగుణంగా తరగతి గదిలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఆరోగ్యకరంగా ఉండేలా చూడడం, వ్యవస్థలో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న జాతీయ విద్యా విధానం లక్ష్యానికి అనుగుణంగా ఉత్తమ అభ్యాసన ఫలితాలు సాధించేందుకు కోటాను తొలగించారు. ప్రస్తుతం కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు ప్రత్యేక కోటాను కేంద్రం 2022 ఏప్రిల్‌లో రద్దు చేసింది.

Exit mobile version
Skip to toolbar