Prime9

NDA government : కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా రెండు దశల్లో కులగణన

Caste Census in India : జనాభా లెక్కలకు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. లెక్కలు దేశాభివృద్ధికి పలు విధాలుగా దోహదపడనున్నాయి. తదుపరి దేశ జనాభా గణన 2027, మార్చి ఒకటి నుంచి ప్రారంభం కానున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిలో కుల గణనతోపాటు కీలకమైన సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించనున్నారు.

 

కులగణన 2026 అక్టోబర్ నుంచి లడఖ్, జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. కులగణనను రెండు దశల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పురుషులు, మహిళల గణాంకాలతోపాటు, వారి కులం, ఉపకులాలపై ప్రభుత్వం సమాచారం సేకరించనుంది. కులాల వారీగా జనాభా గణన చేయడం వల్ల ఎవరెవరికి వాస్తవంగా సరైన అవకాశాలు లభిస్తున్నాయో, ఎవరు ఇంకా వెనుకబడి ఉన్నారో లాంటి విషయాలు వెల్లడి కానున్నాయి. విద్య, ఉపాధి, ఆరోగ్యం, ప్రభుత్వ సహాయాలు తదితర అంశాల్లో సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు ఎంతో కీలకంగా మారనుంది. దీని ఆధారంగా ప్రభుత్వం విధానాలను రూపొందించాల్సి ఉంటుంది.

 

కుల గణనకు పలు రాజకీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. దేశంలో చివరిసారి అధికారికంగా కులాల వారీగా జనాభా గణన 1931లో చేపట్టారు. ఆ తర్వాత 1941లో మళ్లీ చేయాలనుకున్నా, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా కులగణన నిర్వహించలేకపోయారు. దీంతో నాటి గణనలే ఇప్పటికీ రిఫరెన్స్ పాయింట్‌గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో 2011లో కుల గణన జరిగింది. ఇది పూర్తి వివరాలతో బయటకు రాలేదు. 1948 జనాభా చట్టం ప్రకారం వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచాలి. ఈ కారణంగా నాటి గణాంకాలపై స్పష్టత రాలేదు.

Exit mobile version
Skip to toolbar