Site icon Prime9

Uttar Pradesh : అతడితో ఎఫైర్.. ప్రియుడికి విషమించి..

Uttar Pradesh

Uttar Pradesh : ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. కొన్ని రోజులుగా ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. ప్రియుడు ప్రియురాలికి ఈ క్రమంలోనే నగదు, బంగారం కొనిచ్చేశాడు. ఇంతలోనే ఆమె వేరే వ్యక్తితో పరిచయం చేసుకొని ప్రియుడికి నమ్మించి మోసం చేసింది. ఈ ఘటన యూపీలోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. సహజీవనం సమయంలో ఇచ్చిన డబ్బులు, బంగారం తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని ప్రియుడు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ప్రియురాలు తన స్నేహితులతో కలిసి అతడిని ఆమె కొట్టించింది. మరీ బలవంతంగా విషం తాగించింది. దీంతో అతడు అస్వస్థతకు గురి కాగా, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

హమీర్‌పూర్‌కు చెందిన శైలేంద్ర గుప్తా అనే వ్యక్తి మహోబాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం కాలిపహరి గ్రామానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ అద్దె ఇంట్లో కలిసి నివాసం ఉంటున్నారు. కొంతకాలం ఇద్దరూ సహజీవనం చేశారు. ఇదే క్రమంలో విలువైన నగలు, రూ.4లక్షల డబ్బులు తన ప్రియురాలికి ఇచ్చాడు.

 

 

కొన్నేళ్ల తర్వాత ఆ మహిళకు మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. దీంతో శైలేంద్రకు ఆమె దూరంగా ఉండటంతో ఇద్దరూ విడిపోయారు. ఈ సందర్భంగా తాను ఇచ్చిన నగలు, డబ్బులు తిరిగి ఇవ్వాలని శైలేంద్ర ఆమెను డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు మహిళ నివసించే ఇంటికి అతడు వెళ్లాడు. ఈ క్రమంలోనే తన స్నేహితలతో కలిసి కొట్టింటింది. బలవంతంగా విష పదార్థాన్ని తాగించింది. దీంతో శైలేంద్ర తీవ్ర అస్వస్థతకు గురికాగా, జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు, నగలు గురించి మరోసారి అడిగితే తప్పుడు కేసులో ఇరికిస్తామని మహిళ, ఆమె స్నేహితులు తనను బెదిరించినట్లు శైలేంద్ర ఆరోపించారని పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను సదాబ్ బేగ్, దీపక్, సంతోషంగా గుర్తించినట్లు చెప్పారు. ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు

Exit mobile version
Skip to toolbar