Site icon Prime9

Unesco honour : భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం

Unesco honour

Unesco honour

Unesco honour : మన భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటుదక్కింది. విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని కొనియాడారు.

 

14 శాసనాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు..
భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను ప్రపంచం మొత్తం గౌరవిస్తోందని కేంద్రమంత్రి గజేంద్ర సింగగ్ షేకావత్ అన్నారు. రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు అన్నారు. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో వెల్లడించారు.

 

సంతోషం వ్యక్తంచేసిన ప్రధాని మోదీ..
యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు దక్కడంపట్ల ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని కొనియాడారు. గీత, నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్‌లో చేర్చడం, మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపుగా అభివర్ణించారు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయన్నారు. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

యుద్ధరంగంలో సోదరులు, గురువులు, బంధు జనుల అందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ- భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. మనుషులు ప్రవర్తించాల్సిన తీరు, పారలౌకికాన్ని పొందే తెన్ను రెండింటినీ శ్రీకృష్ణుడు బోధించాడు.

 

 

Exit mobile version
Skip to toolbar