Site icon Prime9

Tahawwur Rana : ఢిల్లీకి చేరుకున్న తహవూర్‌ రాణా.. వాదనలు వినిపించనున్న నరేందర్‌ మాన్‌

Tahawwur Rana

Tahawwur Rana

Tahawwur Rana : ముంబై పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడైన తహవూర్‌ రాణా ఇండియాకు చేరుకున్నారు. అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం విమానం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

 

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భద్రత కట్టుదిట్టం..
మరోవైపు రాణా రాక సందర్భంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుతోపాటు పలు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు‌, సాయుధ కమాండోలు మోహరించారు. రాణాను ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వావాహనంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. భారీ భద్రత మధ్య అతడిని విచారించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తహవూర్‌ రాణాను తీహార్‌ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కేసును వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌గా నరేందర్‌ మాన్‌ను నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో ఎన్‌ఐఏ తరఫున వాదనలు వినిపించనున్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar