Ministry of Law and Justice: కొత్త చీఫ్ జస్టిస్ పేరు సూచించండి.. సీజేఐకు న్యాయశాఖ లేఖ

భారత ప్రధాన న్యాయమూర్తి తదుపరి చీఫ్ జస్టిస్ గా ఎవర్ని నియమిస్తారో చెప్పాలంటూ జస్టిస్ యు యు లలిత్ కు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.

New Delhi: భారత ప్రధాన న్యాయమూర్తి తదుపరి చీఫ్ జస్టిస్ గా ఎవర్ని నియమిస్తారో చెప్పాలంటూ జస్టిస్ యు యు లలిత్ కు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేఖలో కొన్ని విషయాలు పొందుపరిచారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ యు యు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు.

ఈ నేపధ్యంలో తదుపరి సీజెఐగా సీనియార్ న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేరును జస్టిస్ లలిత్ ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్ల పదవిని పూర్తి స్థాయిలో జస్టిస్ చంద్రచూడ్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2024 నవంబర్ 9వరకు ఆయన సీజెఐగా కొనసాగే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(02) ప్రకారం సీజెఐ నియామకం జరుగుతుంది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో నాలుగు జడ్జి స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రస్తుత సీజెఐ లలిత్ కు వీలుండదు. కొలిజియం నిర్ణయం తీసుకోవాలంటే కొనసాగుతున్న సీజెఐ పదవీ విరమణ చేసే సమయానికి నెల రోజుల ముందు కొత్త నియామకాలు చేపట్టేందుకు వీలుండదు..

ఇది కూడా చదవండి: లైవ్ లో ప్రారంభమైన సుప్రీం కోర్టు విచారణ