Site icon Prime9

Sonali Phogat death: సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ విచారణ కోరుతున్న కుటుంబ సభ్యులు

Sonali Phogat death: బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ గోవాలో సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. అయితే సోనాలి కుటుంబ సబ్యలు మాత్రం ఆమె మరణం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు సీబీఐ విచారణ కోరుతున్నారు.

సోనాలి తన మరణానికి ఒక రోజు ముందు తన తల్లితో ఫోన్‌లో మాట్లాడిందని భోజనం చేసిన తర్వాత ‘అశాంతిగా ఉందని ఫిర్యాదు చేసిందని సోనాలి సోదరి రూపేష్ పేర్కొంది. ఆమె చనిపోయే ముందు సాయంత్రం ఆమె నుండి నాకు కాల్ వచ్చింది. ఆమె వాట్సాప్‌లో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పింది. ఆమె మా అమ్మతో మాట్లాడి భోజనం చేసిన తర్వాత అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేసిందని రూపేష్ చెప్పింది. సోనాలీ యొక్క సోదరుడు రామన్ కూడ తన సోదరి శారీరకంగా దృఢంగా ఉందని గుండెపోటు వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. ఆమె గుండెపోటుతో చనిపోయిందని అంగీకరించడానికి నా కుటుంబం సిద్ధంగా లేదు. ఆమెకు అలాంటి వైద్య సమస్య లేదు. దీనిపై సీబీఐతో సరైన విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

సోనాలి 2016లో ఏక్ మా జో లఖోన్ కే లియే బనీ అమ్మ అనే డైలీ సోప్‌తో నటనలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె చోరియన్ చోరోన్ సే కమ్ నహీ హోతీలో కనిపించింది. పలు పంజాబీ మరియు హర్యాన్వి మ్యూజిక్ వీడియోలలో నటించింది. ఆమె చివరిగా 2019 వెబ్ సిరీస్, ది స్టోరీ ఆఫ్ బద్మాష్‌గఢ్‌లో కనిపించింది.

Exit mobile version