Site icon Prime9

Girija Vyas : హారతి ఇస్తుండగా మంటలు.. కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర గాయాలు

Girija Vyas

Girija Vyas

Girija Vyas : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. తాజాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో తన ఇంట్లో పూజలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే పూజ సమయంలో హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

 

 

తన నివాసంలో ఆమె హారతి ఇస్తుండగా, కింద వెలుగుతున్న దీపం నుంచి మంటలు దుపట్టాకు అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్లు గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ తెలిపారు. కుటుంబ సభ్యులు హుటహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా సేవలందించారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా కూడా పనిచేశారు.

Exit mobile version
Skip to toolbar