Sarees Offer Sale: మహిళలకు, చీరలకు విడదీయలేని అనుబంధం. అదే చీరలు డిస్కౌంట్ లో వస్తే ఇక వదులుతారా? చీరల కోసం ఎక్కడికైనా వెళ్లాల్సిందే. తాజాగా బెంగళూరు మల్లేశ్వరం ప్రాంతంలోని ఓ షాప్ లో చీరలపై భారీ డిస్కౌంట్ ను ఇచ్చారు. చీరలపై దాదాపు 35 శాతం అంటూ మల్లేశ్వరం ప్రాంతంలోని మైసూరు సిల్క్ శారీ సెంటర్ ముందు బోర్డు పెట్టారు. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న మహిళలు ఆ షాపింగ్ మాల్ ముందు బారులు తీరారు. చాలా మంది చీరల కోసం ఎగబడ్డారు.
నచ్చిన చీరల కోసం..(Sarees Offer Sale)
షాపులో ఇసుకేస్తే రాలనంతగా మహిళలు వచ్చారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నచ్చిన చీరల కోసం మహిళలంతా వెతుకుతున్నారు. ఈక్రమంలో ఇద్దరు మహిళలకు ఒకే చీర విషయంలో తగాదా మొదలైంది. అది సిగపట్లు వరకూ వచ్చింది. ‘ చీర నాక్కావాలంటే.. నాకే కావాలి’ అంటూ ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఓ పోలీస్, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆపినా ఇద్దరు మహిళలు ఆపలేదు.
వీడియో వైరల్(Sarees Offer Sale)
ఈ తతంగాన్ని అంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది కాస్త వైరల్ అయింది. చీర కోసం మహిళలు కొట్టుకున్న వీడియోను చూసిన వారంతా ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ‘చీరలంటే ఇష్టం ఉండాలి.. కానీ ఇలా కొట్టుకుంటారా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అటు ఆఫర్ ప్రకటించిన షాప్ యజమానులపైన కూడా నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023