mega888 Sengol Controversy: లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు

Sengol Controversy: లోక్‌సభలో సెంగోల్ స్దానంలో రాజ్యాంగ ప్రతిని ఉంచాలంటూ ఎస్పీ ఎంపీ డిమాండ్..

లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు చేసిన 'సెంగోల్' ఔచిత్యాన్ని సమాజ్ వాదీ పార్టీకి చెందని ఎంపీ ప్రశ్నించడంతో బీజేపీ ఎదురుదాడికి దిగింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కె చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో 5 అడుగుల పొడవున్నబంగారు పూతతో కూడిన 'సెంగోల్' స్దానంలో రాజ్యాంగ ప్రతిని తప్పనిసరిగా ఉంచాలని అన్నారు.

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 05:41 PM IST

Sengol Controversy: లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు చేసిన ‘సెంగోల్’ ఔచిత్యాన్ని సమాజ్ వాదీ పార్టీకి చెందిప ఎంపీ ప్రశ్నించడంతో బీజేపీ ఎదురుదాడికి దిగింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కె చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో 5 అడుగుల పొడవున్నబంగారు పూతతో కూడిన ‘సెంగోల్’ స్దానంలో రాజ్యాంగ ప్రతిని తప్పనిసరిగా ఉంచాలని అన్నారు. దీనితో ఇది చర్చకు దారి తీసింది.

రాజుల కాలం ముగిసింది..(Sengol Controversy)

దీనిపై ఎంపీ చౌదరి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఆమోదించడం దేశంలో ప్రజాస్వామ్యానికి నాంది పలికింది. బీజేపీ ప్రభుత్వం తన చివరి టర్మ్‌లో స్పీకర్ కుర్చీ పక్కన ‘సెంగోల్’ని ఏర్పాటు చేసింది. సెంగోల్ అనేది తమిళ పదం, దీని అర్థం రాజదండం. రాజ్‌దండ్ కూడా అంటే రాజుల యుగం తర్వాత మనం స్వతంత్రులమైపోయాం. ఓటరుగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ దేశాన్ని రాజ్యాంగం ద్వారా నడిపిస్తారా లేదా? అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజ్యాంగం యొక్క కాపీని ‘సెంగోల్’తో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వివాదంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ సెంగోల్’ని పార్లమెంటులో పెట్టినపుడు ప్రధానమంత్రి దానికి నమస్కరించారు. కానీ ఈసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన నమస్కరించడం మర్చిపోయారు. మా ఎంపీ దాని గురించి ప్రధానికి గుర్తు చేయాలనుకుంటున్నారని నేను భావిస్తున్నానని చెప్పారు.

ప్రతిపక్షనేతల మద్దతు..

కాంగ్రెస్ డు ఎంపీ బి మాణికం ఠాగూర్ ‘సెంగోల్’ సమాజ్ వాదీ పార్టీ ఎంపీని సమర్దించారు. సెంగోల్ రాజరికానికి ప్రతీక. రాజులయుగం ముగిసిందని మేము చాలా స్పష్టంగా చెప్పాము.ఇపుడు మనం ప్రజాస్వామికంగా మసలుకోవాలని అన్నారు. మరోవైపు సమాజ్ వాదీ ఎంపీ చౌదరి డిమాండ్ కు ఆర్జేడీ ఎంపీ, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి కూడా మద్దతు పలికారు. ఎవరు దీనిని డిమాండ్ చేసినా, నేను దానిని స్వాగతిస్తున్నానని అమె అన్నారు.

యూపీ సీఎం యోగి కౌంటర్..

సమాజ్‌వాదీ పార్టీకి భారతీయ చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సెంగోల్‌పై వారి అగ్రనేతల వ్యాఖ్యలు ఖండించదగినవి. ఇవి వారి అజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. ఇది ముఖ్యంగా తమిళ సంస్కృతిపై భారత కూటమి యొక్క ద్వేషాన్ని కూడా సూచిస్తున్నాయని ఆదిత్యనాథ్ అన్నారు.