Site icon Prime9

Central Cabinet: చమురు సంస్థల నష్టాలకు రూ 22వేల కోట్లు సాయం..కేంద్రం

Rs 22,000 crore aid for losses of oil companies

Rs 22,000 crore aid for losses of oil companies

Oil companies: సామాన్యుడికి ఇస్తున్న సబ్సిడి గ్యాస్ ధరలతో చమురు సంస్ధలు నష్టాల్లోకి జారుకొన్నాయి. ఈ నేపధ్యంలో చమురు సంస్ధల నష్టాలను పూడ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీలకు వచ్చిన నష్టాల భర్తీకి కేంద్రం రూ. 22వేల కోట్లు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

దీంతోపాటు ప్రైమ్ మినిస్టర్ డెవెలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  2022-23 నుంచి 2025-26 వరకూ పదిహేనో ఆర్ధిక కమిషన్ ప్రకారం ఈ కొత్త పథకం అమలౌతుందని పేర్కొన్నారు.

గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడికి గుదిబండగా మారాయని ప్రతిపక్షాలతోపాటు సామాన్యుడు సైతం గగ్గోలు పెడుతున్న సమయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని చర్చనీయాంశంగా మారింది. భారత్ జోడో యాత్రలో పెరిగిపోతున్న నిత్యవసర వస్తువల ధరల తాకిడి వార్తల నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయంతో వారికి చెక్ పెట్టనుంది.

ఇది కూడా చదవండి:Central Govt Jobs: 10 పాసయ్యారా.. అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకేసమే..!

Exit mobile version