Ravi Sinha: భారత రీసెర్చ్ అండ్ అనలసిస్ వింగ్ అధిపతిగా ఐపిఎస్ అధికారి రవి సిన్హాని నియమించారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత రా చీఫ్ సామంత్ గోయల్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఆ తరువాత రవిసిన్హా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ లేదా రెండేళ్ళ పాటు రవి సిన్హా రా చీఫ్‌గా కొనసాగుతారు. ప్రస్తుతం రవి సిన్హా కేబినెట్ సెక్రటేరియట్‌లో ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్నారు. బిహార్‌కి చెందిన రవి సిన్హా 1988 బ్యాచ్‌కి చెందిన చత్తీస్ గఢ్ కేడర్ ఐపిఎస్ అధికారి. గూఢచర్యంలో రవిసిన్హాది అందెవేసిన చేయి. ఇంటెలిజెన్స్ వ్యవహారాలపై గట్టి పట్టుంది. ప్రతిభావంతుడైన ఐపిఎస్ అధికారి అయినా ఆ దర్పాన్ని రవి సిన్హా ఎక్కడా ప్రదర్శించరని ఆయనని తెలిసిన వారు చెబుతారు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ మూడో కంటికి తెలియకుండా పనులు చక్కబెడతారని సహచరులు ప్రశంసిస్తుంటారు.
సిన్హా గతంలో జమ్మూ కాశ్మీర్, ఈశాన్య, విదేశాల్లో పనిచేశారు.గోయెల్ జూన్ 2019లో రెండేళ్లపాటు రా చీఫ్‌గా నియమితుడయ్యారు. తర్వాత అతనికి 2021 మరియు జూన్ 2022లో ఒక్కో సంవత్సరం చొప్పున రెండు పొడిగింపులు ఇవ్వబడ్డాయి.జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన విషయాలపై నిపుణుడైన గోయెల్, ఫిబ్రవరి 2019లో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్‌ను ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.