Prime9

Rajasthan : రాజస్థాన్‌లో అమానుష ఘటన.. ఐసీయూలో రోగిపై అత్యాచారం

Nursing staff rapes woman undergoing treatment in ICU : రాజస్థాన్‌‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

పోలీసుల వివరాల ప్రకారం.. ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాలలో ఓ మహిళ (32) ఐసీయూలో చికిత్స పొందుతుంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు బయట వేచి ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ నర్సింగ్‌ సిబ్బంది ఐసీయూలోకి వచ్చి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి ముందు మహిళ బెడ్‌ చుట్టూ కర్టెన్‌లు వేసి బాధితురాలికి మత్తుమందు ఇచ్చాడు. ఈ క్రమంలో బాధితురాలు స్పృహలో ఉండటంతో తన కుటుంబ సభ్యులను పిలిచేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది.

 

బాధితురాలి భర్త ఆసుపత్రి సిబ్బందిని నిలదీయగా, వారు ఖండించారు. వెంటనే కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటుచేస్తామని ఆసుపత్రి అధికారి ఒకరు పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar