Puducherry schools: భారత్ లో హెచ్ 3ఎన్2 వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ వైరస్ తో ఓ మెడికల్ స్టూడెంట్ మృతి చెందాడు. దీంతో దేశంలో ఈ వైరస్ తో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది.
వైరస్ విజృంభణ నేపథ్యంలో పాండిచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇన్ ఫ్లుయోంజా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో పాఠశాలలకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
అన్ని స్కూళ్లలో 8 తరగతి వరకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది.
మార్చి 16 నుంచి 24 వరకు పాఠశాలలకు సెలవులు అమలులో ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు(Puducherry schools)
పాండిచ్చేరిలో మార్చి 11 వరకు 79 ఇన్ ఫ్లుయెంజా కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో మరణాలు మాత్రం చోటు చేసుకోలేదు.
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూళ్లకు సెలవుల నిర్ణయం తీసుకున్నారు.
వైరస్ కు చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఇన్ ఫ్లూయెంజా కేసులకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు.
ఇప్పటి వరకు 7 గురు మృతి
కరోనా లాంటి లక్షణాలున్న ఈ ఇన్ ఫ్లూయెంజా కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి హాస్పిటల్ లో చేరుతున్న వారి సంఖ్య
రోజురోజుకు పెరుగుతున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే.
గత రెండు నెలల నుంచి ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది.
జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశ వ్యాప్తంగా 451 హెచ్ 3ఎన్2 వైరస్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఈ సీజనల్ ఇన్ ఫ్లూయెంజా కారణంగా కర్ణాటక, హర్యాణా, గుజరాత్ లతో సహా ఇప్పటి వరకు 7 గురు ప్రాణాలు కోల్పోయారు.