Agra: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే ఒకరి నొకరు కొట్టుకుంటే … వారు విద్యార్థులను ఉత్తమ పురుషులుగా ఎలా తీర్చగలుగుతారు? వీరిని చూసి వారు కూడా రౌడీల్లా తయారవుతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు అసలు కథ ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. మహిళా ప్రిన్సిపల్…మహిళా టీచర్ ఒకరు జుట్టు ఒకరు పట్టుకునే కొట్టుకొనే వరకు పోయారు. స్కూల్లో పనిచేసే టీచరు విధులకు ఆలస్యంగా రావడం… ప్రిన్సిపల్ నిలదీయడంతో అసలు గొడవ మొదలైంది.
స్కూల్లో పనిచేసే టీచరు గుంజా చౌదరి స్కూల్‌కు ఆలస్యంగా వచ్చారు. దీంతో స్కూల్ ప్రిన్సిపల్ ఆమెను నిలదీశారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీనికి టీచర్ ప్రిన్సిపల్‌ను ఉద్దేశించి గత నాలగు రోజుల నుంచి మీరు కూడా విధులకు ఆలస్యంగా వస్తున్నారు కదా అని ఎదురు ప్రశ్నించారు. టీచర్ తనను ప్రశ్నించడం ఏమిటని ప్రిన్సిపల్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. అటు తర్వాత ఇద్దరు మహిళా గురువులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇరువురి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. తర్వాత బాహాబాహీకి గివారు. ఈ తతంగం జరుగుతన్నప్పుడు సీన్‌లో ఇతర స్కూల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఇద్దరిని విడదీయాలని ప్రయత్నించినా.. వారు ఒకపట్టాన వదలలేదు. చివరకు టీచర్ ప్రిన్సిపల్ దుస్తులు చించేయడం.. దీంతో ఆగ్రహంతో ప్రిన్సిపల్ టీచర్ జుట్టుపట్టుకొని లాగడం జరిగింది. దీంతో టీచర్ కంటికి గాయం అయ్యింది.
కాగా ఈ సంఘటన ఆగ్రాలోని సికందర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇరువురు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అధికారింగా కేసు రిజిస్టర్ చేయలేదు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియా ఎక్స్‌లో తెగ వైరల్ అవుతోంది. సుమారు రెండు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. పిల్లలకు విద్యా బుద్ధులు నెర్పాల్సిన వీరు వీధి రౌడీల్లాగా కొట్టుకుంటే పిల్లలకు ఏం చదువు చెబుతారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ డబుల్ ఇంజిన్ కీ సర్కార్ అని గొప్పగా చెబుతుంటారు. ఇదేనా డబుల్ ఇంజిన్ కీ సర్కార్ అని యూపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొనే పిల్లలకు భవిష్యత్తు లేదని వాపోతున్నారు. ఇద్దరిని ఇంటికి పంపించాలన్న డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు.