Ayodhya Deepostav: అయోధ్యలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. వెలుగుజిలుగుల కాంతుల నుడుమ అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. వేల కోట్ల రూపాయలతో శ్రీరామనగరాన్ని అభివృద్ది చేస్తున్నామని, జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించుకోవాలని ఆయన యావత్ ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పవిత్ర అయోధ్య నగరంలో అణువు అణువునా శ్రీరాముడు కొలువై ఉంటాడని ఆయన పేర్కొన్నారు.
రామజన్మభూమిలో దీపావళి వేడుకలు మిన్నంటాయి. ఉత్తరప్రదేశ్లో సరయూ బ్యాంక్ వద్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపోవత్సవ్ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ వచ్చేశారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కూడా ఈ వేడుకలో పాల్పంచుకున్నారు.
సరయూ నదికి ప్రత్యేక హారతి ఇచ్చారు. దీపోత్సవ్ సందర్భంగా అయోధ్యలో 22,000 మంది వాలంటీర్లు మరియు భక్తులతో దాదుపు 18 లక్షల మట్టి దివ్వెలను వెలిగించారు. సరయూ నది తీరమంతా దివ్వెలతో వెలిపోయింది. శ్రీరాముడి ఆశీస్సులతో తాను అయోధ్యను దర్శించుకున్నట్టు మోదీ తెలిపారు. 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు మోదీ. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్య చేరిన వెంటనే ప్రధాని మోదీ మొదటగా శ్రీరామ్ లాలాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర నిర్మాణపు పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. ఆలయ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇక రామ్‌లీలా సందర్భంగా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. రామాయణం థీమ్‌గా ఏర్పాటు చేసిన లేజర్‌షో అందరిని ఆకట్టుకుంది. రామ్‌లీలా కోసం శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు హెలికాప్టర్‌లో విచ్చేశారు. అనంతరం సీతారామ లక్ష్మణ బృందాన్ని వారివారి స్థానాల్లో ఆసీనులు గావించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు యోగి ఆదిత్యనాథ్ మరియు ప్రధాని మోది. శ్రీరామ పట్టాభిషేకాన్ని తన చేతుల మీదుగా నిర్వహించారు మోదీ.
ఇదీ చదవండి: దీపావళికి ఈ 4 లక్ష్మీ ఆలయాలను సందర్శిస్తే సిరిసంపదలు మీ సొంతం