PM Narendra Modi wishes to delhi peoples: ఢిల్లీలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. బీజేపీ 36 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మరో 11 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. మరోవైపు, ఆప్ 19 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.
ఢిల్లీలో బీజేపీ విజయానికి అభివృద్ధి, సుపరిపాలన కారణమని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీని అభివృద్ధి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోమని ఆయన మాటిచ్చారు. ఢిల్లీ అభివృద్ధి మా గ్యారెంటీ అని, ఢిల్లీవాసుల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషిస్తుందని మోదీ తెలిపారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఏపీలోని పలు చోట్ల సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు బాణసంచా కాల్చి కేరింతలు కొట్టారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు.