Site icon Prime9

PM Narendra Modi: నాయకత్వ లక్షణాలు నేర్పే ఎన్‌సీసీ.. దేశవ్యాప్తంగా 8 లక్షల మహిళా కేడెట్లు

PM Narendra Modi said NCC inspired youth towards nation building: ప్రపంచాభివృద్ధిలో భారతదేశ యువత కీలక భూమిక వహిస్తోందని, వీరి భాగస్వామ్యం లేకుండా ప్రపంచాభివృద్ధిని ఊహించలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దశాబ్దాలుగా దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్స్‌లో సోమవారంనాడు జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.

సరిహద్దు వరకు మీ సేవలు
గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎన్‌సీసీ కోసం తీసుకున్న నిర్ణయాలు తనకు సంతృప్తిని ఇచ్చాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని 170 సరిహద్దు ప్రాంతాలు, సుమారు 100 తీరప్రాంత సరిహద్దులకు ఎన్‌సీసీసీ క్యాడెట్లు విస్తరించారని, తద్వారా ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరిందని చెప్పారు.

జమిలిపై చర్చించండి
‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’పై దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు చర్చించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి దేశంలో ఎన్నికలు జరుగుతుంటే.. కాలేజీలు, విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సమయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. దేశ భవిష్యత్తుకు ఏకకాలంలో ఎన్నికలు కీలకమని అన్నారు.

6 లక్షలు పెరిగారు..
2014లో దేశంలోని ఎన్‌సీసీ క్యాడెట్ల సంఖ్య 14 లక్షలుగా ఉండగా, నేడు అది 20 లక్షలు అయిందని, వీరిలో 8 లక్షలమంది మహిళా క్యాడెట్లేనని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ ఉద్దేశాలపై ఎన్‌సీసీ క్యాడెట్లతో సహా దేశ యవత దృష్టిసారించాలని మోదీ కోరారు. దేశ వికాశంతోనే భారత్ అంతర్జాతీయంగా ఉన్నత స్థాయికి చేరుకుంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫార్మ్‌డ్ యూత్ ఆర్గనైజేషన్‌గా ఎన్‌సీసీ నిలిచిందని, విపత్తు వేళల డిజాస్టర్ మేనేజిమెంట్‌తో కలసి పలు సేవలు అందిస్తోందని అన్నారు.

ట్రంప్‌తో మాటా మంతీ
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఫోన్‌ చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకు మోదీ ఆయనకు ఫోన్‌ చేసి, వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేశారు. ‘చరిత్రాత్మకంగా రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రియ మిత్రుడికి అభినందనలు’అని మోదీ ట్వీట్‌ కూడా చేశారు. ‘అమెరికా అధ్యక్షుడైన నా ప్రియమిత్రుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. పరస్పరం రెండు దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రత, ప్రజల సంక్షేమం కోసం మేం కలిసి పనిచేస్తాం’ అని మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar