Prime9

PM Modi @G7 Summit: కెనడా చేరుకున్న ప్రధాని మోదీ.. జీ7 సమ్మిట్ లో ప్రసంగం!

PM Modi Reached Canada to attend G7 Summit: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. కెనడాలోని కాల్గరీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింది. కాగా నేడు, రేపు ప్రధాని కెనడాలో పర్యటించనున్నారు. కెనడాలోని అల్బెర్టా ప్రాంతం కననాస్కిస్ గ్రామంలో జరిగే జీ7 సమ్మిట్ కు హాజరుకానున్నారు. ముఖ్యంగా భారత్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ మీద ప్రసంగం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

కాగా 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనల అనంతరం ప్రధాని మోదీ కెనడాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2015 తర్వాత ప్రధాని కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే జీ7 కూటమిలో ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, యూకే, జపాన్, ఇటలీ, కెనడా, యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో భారత్ కు సభ్యత్వం లేదు. అయినా ఈ ఏడాది జరిగే జీ7 సదస్సుకు భారత ప్రధాని మోదీని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. కాగా జీ7 సమ్మిట్ లో సభ్యదేశాలు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులు, ఆర్థిక మాంద్యం, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

 

 

Exit mobile version
Skip to toolbar