Site icon Prime9

Pahalgam Terror Attack: వదిలే ప్రసక్తే లేదు.. వెతికి, వేటాడి చంపుతాం: ప్రధాని మోదీ

pm modi said on pulhama attack India will identify track and punish every terrorist

 

PM Modi Reaction on Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్  పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మొదటిసారి స్పందించారు. దాడి చేసిన వారిని, వాళ్ల వెనకుండి నడిపించిన వారినెవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. బీహార్ లోని మధుబనిలో జరిగిన ర్యాలీలో ఆయన మట్లాడుతూ, భారత  స్పూర్తిపై దాడిచేసే వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ర్యాలీలో హిందీలో ఉపన్యసిస్తున్న ఆయన, యావత్ ప్రపంచానికి తెలిసేలా ఇంగ్లీష్ లో ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చి ప్రపంచానికి సందేశమిచ్చారు.

 

ప్రతి ఉగ్రవాదిని, వాళ్ల సపోర్టర్స్ ను వేటాడిమరీ శిక్షిస్తామన్నారు మోదీ. ఏప్రిల్ 22 (మంగళవారం) ప్రశాంతంగా పచ్చిక బయళ్లలో సేదతీరుతున్న పర్యాటకులపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇది భారత ఆత్మపై చేసిన దాడని అన్నారు.

 

వెతికి మరీ శిక్షిస్తాం..

“బీహార్ గడ్డపై నుంచి ప్రపంచానికి బెబుతున్నాను. మేము వారిని భూగోళంలో ఎక్కడ దాక్కునా వెతికి మరీ శిక్షిస్తాం. ఊహించని రీతిలో దెబ్బకొడతాం. ఉగ్రవాదులు భారతదేశం యొక్క స్పూర్తిని ఎప్పటికీ విశ్చిన్నం చేయలేరు. యావత్ ప్రపంచం మాతో ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు మాతో నడుస్తున్నారు. ఇకపై ఉగ్రవాదులను అనిచేసే విధానం కఠినంగా ఉంటుంది. ఇలాంటి రోజు వస్తుందని ఉగ్రవాదులు ఊహించికూడా ఉండరు” అని మోదీ అన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది.

 

దౌత్య పరమైన నిర్ణయాలు..
దాడి జరిగినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ సౌదీఅరేబియా పర్యటనలో ఉన్నారు. విషయంతెలుసుకున్న వెంటనే పర్యటనను రద్దుచేసుకుని బుధవారం ఉదయం ఢిల్లీకి  చేరుకున్నారు. విమానాశ్రయంలోనే అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. పాకిస్తాన్ పై దౌత్య పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపివేశారు. అట్టారి – వాఘా చెక్ పోస్టును మూసివేయడంతో పాటు, హైకమిషన్ల సంఖ్యలను 50 నుంచి 31కి కుదించారు. ఇకపై పాకిస్తాన్ జాతీయులు భారతదేశానికి రావడానికి వీసాలు నిలిపివేశారు.

 

 

Exit mobile version
Skip to toolbar