Site icon Prime9

PM Modi: పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లు.. ప్రధాని మోదీ పోస్ట్ వైరల్

PM Modi Hails Passage Of Waqf Amendment Bill: పార్లమెంట్‌లో ఎట్టకేలకు వివాదాస్పద వక్ఫ్ బిల్లు 2025 ఆమోదం పొందింది. లోక్‌సభతో పాటు రాజ్యసభలో బిల్లు పెట్టగా ఆమోదం తెలిపాయి. అయితే రాజ్యసభలో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందింది. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.

 

పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లుకుఆమోదం లభించడం చరిత్రాత్మకమని అని హర్షం వ్యక్తం చేశారు. ఇది సరికొత్త యుగానికి నాంది అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా వక్ఫ్ బోర్డు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్నారు. తాజాగా, ఈ బిల్లు ఆమోదంతో దేశవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలను నుంచి అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గోన్న ఎంపీలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

 

అంతకుముందు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డులో అందరూ ముస్లిం సభ్యులే ఉంటే వివాదాలు తలెత్తిన సమయంలో హిందువులె, ఇతర మతాల వారికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. చట్టబద్ధమైన బోర్డు సెక్యులర్‌గా ఉండాలని, 22 మందిలో కనీసం కనీసం నలుగురు ముస్లిమేతరులు ఉండేలా బిల్లు రూపొందించామని కేంద్ర మంత్రి వివరించారు.

 

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ.. బిమ్ స్టెక్ సదస్సులో భాగంగా థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వక్ఫ్ సవరణ బిల్లుపై పోస్టు చేశారు. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యం ఇస్తామని అందులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version
Skip to toolbar