Site icon Prime9

Ireland pm Micheal Martin: ఐర్లాండ్ నూతన ప్రధానిగా మిచెల్ మార్టిన్.. విషెస్ చెప్పిన భారత ప్రధాని మోదీ

PM Modi congratulates Ireland Micheal Martin as he wins a second term as Irish Prime Minister: ఐర్లాండ్ నూతన ప్రధానిగా మిచెల్ మార్టిన్ ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ప్రధానికి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

ఐర్లాన్ రాజధాని డబ్లిన్‌లో ఉన్న పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్ తర్వాత మిచెల్ మార్టిన్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యారు. ఫియానా ఫెయిల్ పార్టీ నాయకుడు మార్టిన్‌కు 95 ఓట్లు అనుకూలంగా పోల్ అవ్వగా.. 76 ఓట్లు వ్యతిరేకంగా పోలయ్యాయి. తన సమీప ప్రత్యర్తి ఫైన్ గేల్, స్వతంత్ర్య చట్ట సభ సభ్యులతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్నట్లు అల్ జజీరా వెల్లడించింది.

ఈ 64 ఏళ్ల మార్టిన్ .. గతంలో 2020 నుంచి 2022 వరకు తొలిసారి ప్రధాని పనిచేయగా.. తాజాగా, రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే సంకీర్ణ ఒప్పందం ప్రకారం.. ఫైన్ గేల్ పార్టీకి చెందిన సైమన్ హారిస్ 2027లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, హారిస్.. ఉపప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఫైన్ గేల్ పార్టీకి చెందిన పాస్చల్ డోన్ హూ ఆర్థికమంత్రిగా వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల పాటు ఐర్లాండ్ లోని డబ్లిన్‌లో పర్యటించారు. మోదీ గత 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ భారత ప్రధాని ఐర్లాండ్ లో పర్యటించి రికార్డు నెలకొల్పారు. ఆ సమయంలో ప్రధానికి డబ్లిన్ నగరంలో ఘన స్వాగతం లభించింది.

Exit mobile version