Site icon Prime9

PM Kisan: రైతులకు న్యూ ఇయర్ కానుకగా మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై వారి ఖాతాల్లోకి రూ.10వేలు!

PM Modi Announces New Year Gift for Farmers: కొత్త సంవత్సరం వేళ అన్నదాతలకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రతి ఏటా ఇస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ.6వేల నుంచి రూ. 10వేలకు కేంద్రం పెంచింది. అయితే 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా పంటలు సాగు చేస్తున్న అన్నదాతలకు రూ.6వేలు పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ నగదును రూ.2వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది.

తాజాగా, ఈ మొత్తాన్ని రూ. 10వేలకు పెంచుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుల ఖాతాల్లో నేరుగా రూ.10వేలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే, దానికి ముందే ఆ మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్లు మోదీ వెల్లడించారు.

దేశంలో రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటివరకు 18 వాయిదాలు చెల్లించిన కేంద్రం.. 19వ విడత నిధులు కొత్త ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పెట్టుబడి సాయం పెంచుతున్నట్లు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దేశంలో ఉన్న పేదలకు సుమారు 2 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు సర్వే చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఈ సర్వేను మార్చి 31లోగా పూర్తి చేయాలని మోదీ వెల్లడించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖ సైతం పంపించారు. ఆవాస్ 2024 పేరిట ప్రత్యేక యాప్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ యాప్‌లో ప్రజలు స్వయంగా సర్వేలో పాల్గొనేందుకు వీలు కల్పించారు.

Exit mobile version
Skip to toolbar