EPFO: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద అధిక పెన్షన్ అమలుకు అంగీకారం తెలిపింది. ఈపీఎఫ్ చందాదారుల పదవీ విరమణ అనంతరం.. ఇప్పటివరకు అత్యంత పరిమితంగానే నెలవారీ పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం దీనిలో సవరణ చేశారు. ఉద్యోగి పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేందుకు ఈపీఎఫ్ఓ ఉపక్రమించింది.
2014 సవరణ మార్పు.. (EPFO)
2014 లో ఈపీఎఫ్ఓ ప్రకారం.. పెన్షన్ రూ. 6,500 నుంచి రూ.15 వేల మధ్యలో పొందేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ పెంపును వేతన పరిమితి ఆధారంగా నిర్ణయించేలా.. గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలకు లోబడి.. వర్తింపజేసేందుకు ఈపీఎఫ్‌ఓ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే సంబంధిత కార్యాలయాలకు సర్క్యూలర్ జారీ చేశారు. ఈ మార్పుతో పదవి విరమణ చేసిన ఉద్యోగాలు.. చాలా వరకు లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయంతో.. పదవి విరమణ చేసిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సేవా విభాగం ఏర్పాటు..
ఉద్యోగులు, యాజమాన్యాలు ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తును ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలకు సమర్పించాలని ఆ సంస్థ సూచించింది. ఉద్యోగుల్లో అవగాహనకు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు ప్రకటనను నోటీసుబోర్డులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది. వీటి కోసం.. ప్రత్యేక సేవావిభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ప్రతి జాయింట్ ఆప్షన్ అప్లికేషన్ ను రిజిస్టర్ చేసి.. డిజిటల్‌గా లాగ్ ఇన్ ద్వారా రసీదు సంఖ్యను సంబంధింత ఉద్యోగికి అందించాలని పేర్కొంది. సీలింగ్ కన్నా ఎక్కువ వేతనమున్న ఉద్యోగులు.. ఎక్కువ పింఛన్ కోసం సమర్పించే దరఖాస్తును ప్రాంతీయ పీఎఫ్ వో అధికారులు పరిశీలించి.. పోస్టు ద్వారా లేదా ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలి
ఈపీఎస్ ఎక్కువ పెన్షన్ కు సంబంధించిన ఉద్యోగులు.. సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జాయింట్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు విధానం.. ఇతర వివరాలను సంబంధిత ఆర్‌పీఎఫ్‌సీ అధికారులు వెల్లడిస్తారు. అధిక పింఛన్ కు ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పింఛన్ నిధికి అవసరమైన నగదు సర్దుబాటు.. అదనపు నిధి డిపాజిట్ విషయమై ఉద్యోగి కచ్చితంగా అంగీకరించాల్సి ఉంటుంది. అధిక పెన్షన్ అమలుపై యాజమాన్యాలకు అవగాహన కల్పించడం కోసం అధికారులు అందుబాటులో ఉంటారు.