Social Medeia Effect: సోషల్ మీడియాలో ట్రోల్ అయిన ఓ సంఘటన పేటీఎం సీఈవో విజయ శేఖర్ శర్మను ఫిదా చేసింది. ఆర్ధిక మదుపు పై ఓ చిన్నారి చేసిన ప్రసంగం ఆయన్ను ఇట్టే ఆకట్టుకొనింది. అంతే ఇంకేముంది ఆయన కూడా ఆ చిన్నారి వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
స్వాతి దుగర్ అనే ట్విటర్ యూజర్ తన ఏడేళ్ల కూతరు మ్యూచువల్ ఫండ్ల పై మాట్లాడిన మాటలను వీడియో రూపంలో పోస్టు చేశారు. దీపావళికి నగదు రూపంలో అందిన బహుమతుల్ని నా కూతురు ఏం చేయబోతోందంటే అనే శీర్షికను ట్విటర్ యూజర్ స్వాతి వీడియో ద్వారా పంచుకొన్నారు. నాకు బహుమతుల రూపంలో వచ్చిన డబ్బును ఖాతాలో పొదుపు చేస్తాను. అనంతరం వాటిని మ్యూచువల్ ఫండ్లలో డిపాజిట్ చేస్తాను. నేను మదుపు చేసిన మొత్తాన్ని కంపెనీ వారు ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే రాణిస్తోందో గమనించి పెట్టుబడి పెడతారు. దీంతో వారికి లాభాలు వస్తాయి. వెంటనే నా డబ్బు కూడా పెరుగుతూ పోతుంది. అంటూ ఆ చిన్నారి తన ముద్దు మాటలతో ఆర్ధిక వేత్తలను తలపించింది.
అదే వీడియోలో ఎంతకాలం మదుపు చేయాలని చిన్నారిని ప్రశ్నించిన తల్లికి 10 సంవత్సరాలు అంటూ సమాధానం కూడా చెప్పింది. అంత కాలానికి డిపాజిట్ చేస్తే లాభాలు వస్తాయా? అన్న ప్రశ్నకు చిన్నారి సమాధానంగా ఏటా రాకపోవచ్చు. అయితే దీర్ఘ కాలంగా ఇన్ వెస్ట్ చేస్తే మాత్రం లాభాలు ఆర్జించవచ్చని చెప్పడాన్ని పేటీఎం సీఈవోను ఇట్టే ఆకట్టుకొనింది. ఏ సంస్ధలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు నిత్యం గమనిస్తుంటారని, మ్యూచువల్ ఫండ్స్ వలన అందరికి ఉపయోగకరంగా ఆ చిన్నారి పేర్కొనింది.
ఇది కూడా చదవండి:Viral Video : ఇవేం మేకలు బాబోయ్… సినిమా రేంజ్లో సీన్ని క్రియోట్ చేశాయి !