Congress seeks Amit Shah’s resignation over Ambedkar ‘fashion’ remark: బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అంబేద్కర్ పేరు కేంద్రంగా ఈ వివాదం చోటుచేసుకుంది. రాజ్యసభలో అంబేద్కర్ పేరును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రస్తావించడంపై ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేద్కర్‌ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగానే అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మనుస్మృతి నమ్మే వారిలో అంబేద్కర్‌తో నిస్సందేహంగా ఇబ్బందేనని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు అంబేద్కర్ ఫోటోలతో పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ మధ్య అంబేద్కర్.. అంబేద్కర్ అనడం కొంతమందికి ఫ్యాషన్‌గా మారిందని రాజ్యసభలో అమిత్ షా ప్రస్తావించారు.
రాజ్యాంగంపై జరిగిన చర్చలో అంబేద్కర్ పేరుపై అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు అంబేద్కర్ ఫోటోలతో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేశారు. రాజ్యసభలో రాజ్యాంగం మీద జరిగిన డిబేట్లో అమిత్ షా తన ప్రసంగంలో అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపించారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ తదితరులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ వాల్ విమర్శించారు.
"अभी एक फैशन हो गया है- अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर..
इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता."
अमित शाह ने बेहद घृणित बात की है.
इस बात से जाहिर होता है कि BJP और RSS के नेताओं के मन में बाबा साहेब अंबेडकर जी को लेकर बहुत नफरत है.
नफरत… pic.twitter.com/UMvMAq43O8
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 17, 2024