One Nation One Election: లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన కేంద్రం

One Nation One Election Bill To Be Introduced In Lok Sabha: ఒక దేశం.. ఒకే ఎన్నిక.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఈ బిల్లుపైనే ఉన్నాయి. అయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఎలాంటి మార్పులు చేయాలనే విషయంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది.

జమిలి బిల్లు ఆమోదం తెలిసేందుకు 361 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉండగా.. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ఒక, లోక్‌సభలో తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్‌లు విప్ జారీ చేశాయి. జమిలి బిల్లు కోసం మోదీ సర్కార్ ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తోంది.

జమిలి బిల్లును పార్లమెంటరీ కమిటీకి ప్రభుత్వం పంపనుంది. కమిటీలు బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు పలు పార్టీలకు చోటు కల్పిస్తారు. అయితే ఒక దేశం.. ఒకే ఎన్నిక నినాదం కొన్నేళ్లుగా వినిపిస్తున్న ఎన్డీఏ సర్కార్ ఇందు కోసం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ నివేదిక సైతం ఇచ్చింది.

ఈ ప్రతిపాదన బిల్లు రూపంలో దిగువన ఉన్న సభకు వస్తుంది. ఈ బిల్లు పాస్ కావడం కోసం మోదీ ప్రభుత్వం విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం జేపీసీని ప్రకటించే అవకాశం కూడా ఉంది. జమిలి బిల్లును జేపీసీ పరిశీలించడానికి తొలుత 90 రోజుల సమయం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కాలవ్యవధిని మార్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుండగా.. టీడీపీ మద్దతు తెలిపింది.